- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా.. హీరోయిన్ పోస్టర్ వైరల్
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న సినిమా ‘పురుష:’. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఇప్పటి వరకు మూడు

దిశ, సినిమా : బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న సినిమా ‘పురుష:’. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఇప్పటి వరకు మూడు ప్రధాన పాత్రలకు సంబంధించిన పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా హీరోయిన్ వైష్ణవి కొక్కుర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. భార్యాభర్తల మధ్య గొడవ, ఒకే ఒరలో రెండు కత్తులు ఉండలేవనే సామెతకు తగినట్లుగా ఉన్నఈ పోస్టర్లో ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అనే డైలాగ్ చూస్తుంటే ఈ పాత్ర ఎలా ఉంటుందో అందరికీ అర్థమై ఉంటుంది. మొత్తానికి ఒకరినొకరు అలా సీరియస్‌గా చూసుకుంటూ ఉండటాన్ని గమనిస్తే ఈ చిత్రంలో భార్యాభర్తల పోరు ఏ రేంజ్‌లో చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి పాత్రలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుండా.. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని టీం చెబుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుండగా.. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.






