Puri Jagannath: ఊహించని స్క్రిప్ట్‌తో వచ్చేస్తున్న పూరీ జగన్నాథ్.. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేసిన స్టార్ హీరో!

by Chukka Sudharani |   (  Updated:2025-03-17 14:09:07  IST  )

ఒకప్పుడు టాలీవుడ్‌(Tollywood)లో టాప్ డైరెక్టర్స్‌గా దూసుకుపోయిన వారిలో పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ఒకరు.

Puri Jagannath: ఊహించని స్క్రిప్ట్‌తో వచ్చేస్తున్న పూరీ జగన్నాథ్.. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేసిన స్టార్ హీరో!
X

దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్‌(Tollywood)లో టాప్ డైరెక్టర్స్‌గా దూసుకుపోయిన వారిలో పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ఒకరు. ‘బద్రి, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, బుజ్జిగాడు, టెంపర్’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈయన.. తర్వాత గత కొంత కాలం వరుస ఫ్లాపులు చవిచూశారు. ఇక 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) చిత్రంతో సూపర్ హిట్ సక్సెస్ అందుకుని మళ్లీ కమ్ బ్యాక్ అయ్యారు అనుకుంటే 2022లో వచ్చిన ‘లైగర్’తో తీవ్ర డిజాస్టర్ అందుకున్నారు. ఈ డిజాస్టర్ నుంచి బయటపడేందుకు కొంత గ్యాప్ తీసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart) తెరకెక్కించారు. 2024లో వచ్చిన ఈ మూవీ కూడా పూరీకి అంతగా కలిసి రాలేదు. దీంతో ప్రజెంట్ మరో మూవీ అనౌన్స్ చెయ్యలేదు ఈ డైరెక్టర్.

ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌(Next Project)పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ (Interesting buzz) వినిపిస్తుంది. తమిళం(Tamil)లో స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఇప్పుడు ఈ హీరోతో పూరీ జతకట్టనున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. అందుకున్న సమాచారం మేరకు.. హీరో విజయ్ సేతుపతికి పూరీ జగన్నాథ్ ఓ కథను చెప్పారట. ఆయన కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్‌(Single sitting)లో ఓకే చేశారట విజయ్. అంతే కాకుండా ప్రజెంట్ ఆయన చేస్తున్న సినిమాల్ని కూడా పక్కన పెట్టి కాల్ షీట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఈ ఇంట్రెస్టింగ్ కాంబో.. ఊహించని స్క్రిప్ట్‌(Unexpected script)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ.. ఈ కాంబో సెట్ అయితే హిట్ పక్కా అంటున్నారు నెటిజన్లు.

READ MORE ...

గ్లోబల్ స్టార్ లేటెస్ట్ లుక్స్ చూశారా.. అదిరిపోయాయంతే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్



https://www.dishadaily.com/cinema/have-you-seen-the-global-stars-latest-looks-fans-are-saying-theyre-impressed-422152

Next Story