- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత అంత స్పెషల్‌గా అనిపించిన సినిమా 'సైక్ సిద్ధార్థ'
‘పెళ్లి చూపులు’, ‘కేరాఫ్ కంచరపాలెం’ తర్వాత అంత స్పెషల్‌గా అనిపించిన సినిమా ‘సైక్ సిద్ధార్థ’ అని తెలిపారు నిర్మాత సురేశ్ బాబు. ఈ మూవీ సాంగ్ ‘ ధుమ్ ఠకుమ్’ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. ఈ చిత్రంలో హై ఎనర్జీ ఎంటర్‌టైన్మెంట్ ఉండోతుందని చెప్పారు. డిఫరెంట్‌తో తీసిన ఈ సినిమాలో కొన్ని సీన్స్‌లో తెగ నవ్వొచ్చిందన్నారు

దిశ, సినిమా : ‘పెళ్లి చూపులు’, ‘కేరాఫ్ కంచరపాలెం’ తర్వాత అంత స్పెషల్‌గా అనిపించిన సినిమా ‘సైక్ సిద్ధార్థ’ అని తెలిపారు నిర్మాత సురేశ్ బాబు. ఈ మూవీ సాంగ్ ‘ ధుమ్ ఠకుమ్’ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. ఈ చిత్రంలో హై ఎనర్జీ ఎంటర్‌టైన్మెంట్ ఉండోతుందని చెప్పారు. డిఫరెంట్‌తో తీసిన ఈ సినిమాలో కొన్ని సీన్స్‌లో తెగ నవ్వొచ్చిందన్నారు. నందు ‘పెళ్లి చూపులు’ మూవీ నుంచి తెలుసని.. నందు వరుణ్ వీళ్ళందర్నీ చూస్తున్నప్పుడు నిజంగా వాళ్ళు ఈ సినిమా కోసం ఎఫర్ట్ పెట్టారనిపించిందన్నారు. చాలా పాషన్‌తో మూవీ చేశారని.. చాలా రిస్క్ కూడా తీసుకున్నారని చెప్పారు. రాఘవేంద్ర రావు గారితో పాటు చాలా మందికి ఈ సినిమా చూపించామని.. అందరు కూడా చాలా అప్రిషియేట్ చేశారని తెలిపారు. ఈ స్పెషల్ ఎఫర్ట్‌కి తప్పకుండా సపోర్ట్ చేయాలనిపించిందని.. నందు ఈ సినిమా కోసం ఒక ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజర్... ఇలా అన్ని రకాలుగా పనిచేశాడన్నారు. సాయి మ్యూజిక్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కాగా ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 12న మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది.






