Sarangapani Jathakam: అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూని వాడేస్తున్న హీరోలు.. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలంటూ వీడియో

by Chukka Sudharani |

అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌ (Hot topic)గా మారిన విషయం తెలిసిందే.

Sarangapani Jathakam: అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూని వాడేస్తున్న హీరోలు.. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలంటూ వీడియో
X

దిశ, సినిమా: అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌ (Hot topic)గా మారిన విషయం తెలిసిందే. మీ పచ్చడ్లు ఇంత రేటు ఉన్నాయేంటి అని ఓ కస్టర్ ప్రశ్నించగా.. అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ నడిపే అలేఖ్య బూతులు తిడుతూ ఓ వాయిస్ నోట్ పంపింది. అది కాస్త వైరల్‌గా మారడంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన.. అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూనే నడుస్తుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా వారి సినిమా ప్రమోషన్స్ కోసం ఈ ఇష్యూను వాడేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

నటుడు ప్రియదర్శి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam). ఇంద్రగంటి మోహన కృష్ణ (Indraganti Mohana Krishna) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రూపా కొడువయూర్ (Rupa Koduvayur) హీరోయిన్‌గా నటిస్తుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్ వినోదాత్మకంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ కాగా.. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా.. తాజాగా ఓ ప్రమోషనల్ వీడియోను షేర్ చేశారు. ‘ఫోకస్... చాల ముఖ్యం సారంగ.. వేసవి నవ్వుల ట్రీట్ సారంగపాణిజాతకం ఏప్రిల్ 18న థియేటర్లలో మీ కోసం వేచి ఉంది’ అనే క్యాప్షన్ ఇచ్చి ఓ వీడియో షేర్ చేశారు.

ఈ వీడియోలో.. ప్రియదర్శి జాతకం బుక్ చూస్తూ ఉంటాడు. పక్కనే కూర్చున్న హీరోయిన్ తన ఫోన్‌లో ఓ డ్రెస్‌ను చూపిస్తూ ఇది ఎంత బాగుందో కదా అంటుంది. ఇక సారంగపాణి (ప్రియదర్శి) ఆ డ్రెస్ చూసి వావ్ చాలా బాగుంది అంటూ.. దాని కాస్ట్ చూసి షాక్ అవుతాడు. రూ. 14,999 ఉండటంతో ఇంత రేటా చాలా ఎక్కువ అంటాడు. దానికి హీరోయిన్.. ‘నువ్వు కెరీర్‌పైన ఫోకస్ పెట్టాలమ్మా.. రేపు నీ పెళ్లామో, గర్ల్ ఫ్రెండో ఇలాగే డ్రెస్ చూపించినప్పుడు ఎక్స్‌పెన్సీవ్ అన్నావు అనుకో వదిలిపడేస్తాది నిన్ను. నువ్వు దయచేసి ఈ ప్రేమలు పెళ్లిల్లు జోలికిపోకు ఇప్పుడే. ముష్టి డ్రెస్సే ఎక్స్‌పెన్సీవ్ అంటున్నావు రేపు నీ పెళ్లం ఏ బంగ్లానో, బంగారమో అడిగితే ఏం కొంటావు.. ఈ పుస్తకం పక్కన పెట్టి కెరీర్‌పై ఫోకస్ పెట్టు’ అంటుంది. దానికి హీరో పచ్చడ్ల బిజినెస్ పెడతాను అంటూ చెప్పిన ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

Next Story