‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి ప్రమోషనల్ సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్(పోస్ట్)

by I. Sairam |

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు, జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి ప్రమోషనల్ సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi). ఇక ఈ చిత్రాన్ని నితిన్(Nithin), భరత్‌(Bharath)లు తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో సత్య(Sathya), గెటప్ శ్రీను(Getup Srinu), వెన్నెల కిషోర్(Vennela Kishore), మురళీధర్ గౌడ్, సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే ఈ మూవీ ఏప్రిల్ 11న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అందరి దృష్టిని తమ సినిమా వైపుకు తిప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ.. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అయింది’ అని తెలియజేశారు. ప్రస్తుతం అందాల చందమామ(Andala Chandamama) అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Next Story