ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం 'పవన్'ను సంప్రదించిన దర్శక నిర్మాతలు

by Pulgam srinivas |   (  Updated:2026-03-06 11:04:26  IST  )

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల వారం ముందుకు రావడంతో, అందుకు అనుగుణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్‍ను ఈ సినిమా దర్శక, నిర్మాతలు కలిసినట్లు తెలుస్తోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ను సంప్రదించిన దర్శక నిర్మాతలు
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మొదట మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. కానీ మార్చి 19వ తేదీన విడుదలకు రెడీగా ఉన్న కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. దానితో ఒక్కసారిగా ఈ మూవీ ప్రీ పోన్ అయ్యింది.

ఈ సినిమాను మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలా ఒక్కసారిగా ఈ సినిమా విడుదల తేదీ వారం ముందుకు రావడంతో మేకర్స్ అందుకు అనుగుణంగా ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను కూడా అందుకు అనుగుణంగా చేయాలని ఈ సినిమా దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ దర్శకుడు అయిన హరీష్ శంకర్, నిర్మాతలు అయిన నవీన్, రవి అందరూ కలిసి పవన్ కళ్యాణ్ ను కలిసి ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు, సినిమా ప్రీ ఫోన్ కావడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనుకున్న తేదీ కంటే ముందుగా నిర్వహించాలని అనుకుంటున్నట్లు చెప్పినట్లు, దానికి పవన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.

దానితో ఈనెల 16వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా కనిపించనుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Next Story