వేతనాలు పెంచుతాం కానీ..సినీకార్మికులకు నిర్మాతల డిమాండ్స్

by Ajay Maddhiboyina |

ఫిలిం ఛాంబ‌ర్‌లో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ ముందు నిర్మాతలు నాలుగు ప్రతిపాదనలు ఉంచారు.

వేతనాలు పెంచుతాం కానీ..సినీకార్మికులకు నిర్మాతల డిమాండ్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఫిలిం ఛాంబ‌ర్‌లో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ ముందు నిర్మాతలు నాలుగు ప్రతిపాదనలు ఉంచారు. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలని నిర్మాతలు స్పష్టం చేశారు. అంతే కాకుండా నాన్ మెంబర్స్‌తో కూడా పని చేయించుకుంటాం అని చెప్పారు. షూటింగ్ ఎక్కడ జరిపినా రేషియో ఉండకూడదని నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెబితేనే వేతనాల పెంపుకు నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా వేత‌నాలు పెంచాలి అంటూ సినీకార్మికులు ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇస్తున్న వేత‌నాల‌తో కుటుంబాల‌ను పోషించ‌డం క‌ష్టంగా మారింద‌ని కాబ‌ట్టి వేత‌నాలు పెంచాల‌ని స‌మ్మెకు దిగారు. ఈ నేప‌థ్యంలోనే నిర్మాత‌లు వేత‌నాలు పెంపుకు ఓకే చెబుతూనే ఫెడ‌రేష‌న్ ముందు త‌మ డిమాండ్స్ పెట్టారు. మ‌రి నిర్మాత‌లు పెట్టిన కండిష‌న్స్ కు సినీకార్మికులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Next Story