‘గుర్రం పాపిరెడ్డి’ కడుపుబ్బా నవ్విస్తాడు..

by Sujitha Rachapalli |

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తుండగా.. మురళీ మనోహర్ దర్శకుడు. ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండగా.. సినిమాకు సంబంధించిన

‘గుర్రం పాపిరెడ్డి’ కడుపుబ్బా నవ్విస్తాడు..
X

దిశ, సినిమా : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తుండగా.. మురళీ మనోహర్ దర్శకుడు. ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండగా.. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నిర్మాతలు. ఇప్పటి వరకు తెరపై చూడని డార్క్ కామెడీ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నామని.. సాధారణంగా కొత్త నిర్మాతలు లవ్ స్టోరీ, యూత్ ఫుల్ కంటెంట్ చేస్తుంటారు కానీ తాము ఈ జానర్‌ను ఎంచుకునేందుకు కారణం కథలో బలమని చెప్పారు. ఈ కథ విని తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేస్తానన్నారని.. కానీ కుదరలేదన్నారు. మరో యంగ్ హీరోకు కూడా నచ్చిందని.. చైతన్య జొన్నలగడ్డ ఓ ఇంపార్టెంట్ రోల్‌కు ఓకే చెప్పాడని తెలిపారు. ఆ తర్వాత నరేష్ అగస్త్యకు కథ చెప్పామని.. డైరెక్టర్ కూడా నరేష్ ఈ కథకు యాప్ట్ అని ఫైనల్ చేశారని తెలిపాడు.

ఇక ఫరియా అబ్దుల్లా సౌధామినిగా కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసతుందని.. ఇందులో ఓ సాంగ్ రాసి, పాడి, కొరియోగ్రఫీ కూడా చేసిందని తెలిపారు. బ్రహ్మానందం గారు ఫుల్ లెంత్ రోల్ చేశారని.. యోగీ బాబు రోల్ చాలా బాగుంటుందని తెలిపారు. రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోసిగి మధ్య హిలేరియస్ కామెడీ వర్కవుట్ అయిందని... వాళ్లిద్దరికీ ఈ సినిమా ఫేమ్ తీసుకొస్తుందన్నారు. క్యారెక్టర్స్‌కు తగిన ఆర్టిస్టులనే తీసుకోవాలని అనుకున్నామని.. దాంతో సినిమా బడ్జెట్ అనుకున్నదాని కంటే ఎక్కువైందన్నారు. అప్పుడు యూఎస్‌లో ఉండే మా మిత్రులు వేణు, డా. సంధ్య గారు ప్రొడక్షన్ లో భాగమైందన్నారు. మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నామని.. హిట్ కొడుతామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story