- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటిపై నిర్మాత అత్యాచారం.. సీఎం ఇంటి ముందు నిరసన.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు బాధితురాలి యత్నం..
హర్యన్వి ఇండస్ట్రీ నిర్మాత, నటుడు ఉత్తమ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నటిపై అత్యాచారం కేసులో అరెస్ట్ చేశారు ఘజియాబాద్ పోలీసులు. గౌతమ్ బుద్ధ నగర్‌కు చెందిన 25ఏళ్ల నటిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు ఉత్తమ్ కుమార్.

దిశ, వెబ్ డెస్క్: హర్యన్వి ఇండస్ట్రీ నిర్మాత, నటుడు ఉత్తమ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నటిపై అత్యాచారం కేసులో అరెస్ట్ చేశారు ఘజియాబాద్ పోలీసులు. గౌతమ్ బుద్ధ నగర్‌కు చెందిన 25ఏళ్ల నటిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు ఉత్తమ్ కుమార్. సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని సెక్సువల్‌గా కూడా వాడుకున్నాడు. తరుచుగా ఫామ్ హౌజ్, ఆఫీస్‌కు పిలిచి తనతో ఫిజికల్ రిలేషన్‌కు ఒత్తిడి చేశాడని.. పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు మోసం చేశాడని, ఇప్పుడు తన కెరీర్ ఖతమ్ చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ సీఎం నివాసం ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించింది. తన దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయని.. చాట్స్, కాల్స్, ఇతర ఎవిడెన్స్‌లతో సహా నిరూపిస్తానని చెప్పింది. దీంతో ఉత్తమ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన షాలిమర్ గార్డెన్ పోలీస్ స్టేషన్.. రేప్, ఎస్సీ ఎస్టీ యాక్ట్‌తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. కాగా హర్యాన్వి ఇండస్ట్రీలో గొప్ప పేరున్న నిర్మాత ఉత్తమ్ కుమార్ ఇంతకు ముందు కూడా పలు వివాదాల్లో చిక్కుకోవడం విశేషం.






