ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోంది.. ఆపాలని చూస్తే ఊరుకోను: నిర్మాత వార్నింగ్

by Gantepaka Srikanth |

టాలీవుడ్‌(Tollywood)కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలంటూ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోంది.. ఆపాలని చూస్తే ఊరుకోను: నిర్మాత వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌(Tollywood)కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలంటూ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కార్మికులు హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కమిషనర్‌ ఆఫీసుకు వెళ్లారు. తాజాగా కార్మిక సంఘాలపై ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మిడిల్ మ్యాన్ వ్యవస్థపై నిప్పులు చెరిగారు. స్కిల్ ఉన్న వారికి రూ.1500 కాదు.. రూ.5 వేలు ఇవ్వడానికైనా తాము సిద్ధమని ప్రకటించారు. యూనియన్లు ఎక్స్‌ట్రాలు చేస్తే క్రిమినల్స్‌ ప్రొసీజర్‌కైనా సిద్ధమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో నిర్మాతలు అందరం ఒకే మాట మీద ఉన్నామని అన్నారు. ప్రస్తుతం తాము ప్రభాస్‌తో రాజాసాబ్ షూటింగ్ నడిపిస్తున్నాం.. ఆపాలని ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే దుబాయ్, సింగపూర్‌కు అయినా తీసుకెళ్లి షూటింగ్ చేయిస్తా అని అన్నారు.

Next Story