- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Producer SKN: ఇలాంటి సినిమాలు అమ్మాయిలు చూడాలి.. అందుకే నా తరఫున ఫ్రీ షో వేస్తాను.. నిర్మాత కామెంట్స్
రీసెంట్‌గా ‘బ్యూటీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత SKN అమ్మాయిలకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

దిశ, సినిమా: రీసెంట్‌గా ‘బ్యూటీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత SKN అమ్మాయిలకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఇలాంటి సినిమాలకు సమాజానికి అవసరం కాబట్టి మీకు ఈ అవకాశం అని తెలిపారు. ‘బ్యూటీ మూవీ ఆర్టిస్టులకు సపోర్టుగా నా తరుఫున ఈ సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు గానే అంటే 18వ తేదీన అమీర్‌పేట AAA థియేటర్‌లో ఒక స్క్రీన్ మొత్తం ఆడియన్స్ అందరూ ఫ్రీగా చూడొచ్చండి. అమ్మాయిలు అందరూ కూడా మీ బాయ్ ఫ్రెండ్స్‌తో, మీ ఫాదర్‌తో, మీ బ్రదర్‌తో లేదా ఫ్యామిలీతో ఎవరితో వచ్చిన ఆ టికెట్స్ అన్నీ ఫ్రీ. ఒక్క రుపాయి కూడా ఖర్చుపెట్టకుండా అమ్మాయిలు అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చి హ్యాపీగా ఉచితంగా సినిమా చూడండి. అలాగే ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టండి. ఎందుకంటే ఒక మేధావి యొక్క మౌనం దేశానికి ఎంత ప్రమాదకరమో.. ఒక మంచి సినిమా రీచ్ వెళ్లకపోతే ఇండస్ట్రీకి దానికి మించిన ప్రమాదకరం ఉంటుంది. అందుకే ఈ బ్యూటీ సినిమాను నేను ప్రమోట్ చేస్తున్నాను. నేను ఈ వారం రోజులు పోస్టులు పెడతాను. షోలు కూడా వేస్తాను. ఎందుకంటే ఈ సినిమాలో అంత మేటర్ ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు SKN.
జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మి్స్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్యూటీ’. ప్రేమ కథతో పాటు అంతకు మించిన కుటుంబ విలువలు, ఫాదర్ డాటర్ రిలేషన్, ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వ వహించగా.. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ సైతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 19న విడుదల కాబోతుంది.






