- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పు చేసి జయం రవికి డబ్బులు ఇచ్చా.. సినిమా చేస్తానని మాట కూడా ఇచ్చాడంటూ నిర్మాత సంచలన పోస్ట్
కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi) (రవి మోహన్) ఇటీవల తన భార్య ఆర్తి(Aarti) విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రకటన విడుదల చేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi) (రవి మోహన్) ఇటీవల తన భార్య ఆర్తి(Aarti) విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రకటన విడుదల చేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య తనకు తెలియకుండానే డైవర్స్ ఎలా ఇస్తాడని పోస్ట్ పెట్టడంతో వీరి విడాకులు కాస్త హాట్ టాపిక్‌గా మారాయి. ఇక భార్యతో మనస్పర్థలు తలెత్తడంతో గత కొద్ది కాలంగా జయం రవి సింగర్ కెనీషాతో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన స్పందించి క్లారిటీ ఇవ్వడంతో రూమర్లకు చెక్ పడినట్లు అయింది. ఇక ఇటీవల ఆర్తి కూడా తన పిల్లల బాధ్యత తీసుకోవట్లేదని పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.
జయం రవి, ఆర్తి విడాకుల ప్రకటన కానుంచి వీరిద్దరికి సంబంధించిన వార్తలే సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఆర్తి తల్లి నిర్మాత సుజాత విజయ్‌కుమార్(Sujatha Vijaykumar) జయం రవిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘జయం రవి ఎన్నో అబద్ధాలు చెబుతున్నాడు. ఆయన చెప్పే మాటల్లో ఎలాంటి నిజం లేదు. అందుకే నేను నిజాలు బయటపెట్టేందుకు మాట్లాడుతున్నాను. మొదట్లో జయం రవి ప్రోత్సాహం వల్లే నేను నిర్మాతగా మారాను. ఓ మూడు చిత్రాలు కూడా నిర్మించా. వాటిల్లో జయం రవి హీరోగా నటించాడు. అయితే సినిమాల కోసం రూ. 100 కోట్లు అప్పు తీసుకొచ్చాను. అందులో 25శాతం జయం రవికి ఇచ్చాను.
దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అప్పుల వల్ల నరకం చూశాను. ఒక్కదాన్నే వడ్డీలు కట్టుకునేదాన్ని. అప్పుడు జయం రవి నా బాధ చూడలేక ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడు. కానీ సంతకం చేయలేదు. అప్పులు తీర్చడానికి సాయం చేస్తానని కూడా చెప్పలేదు. అయితే సానుభూతి పొందడం కోసం అతను పలు ఆరోపణలు చేస్తుంటే నాకు బాధగా ఉంది. అయినప్పటికీ అతను హీరోలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది.






