- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Sethupathi: పూరీసేతుపతి ప్రాజెక్టులోకి మరో అగ్ర నిర్మాత.. రెండు పవర్‌హౌస్‌లు ఒకటే పేలుడు అంటూ పోస్ట్
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి.. ఇందులో నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, స్టార్ హీరోయిన్ చార్మీ కౌర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి మరో అగ్ర నిర్మాత JB నారాయణరావు కొండ్రోల్లా జాయిన్ అయినట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు డైరెక్టర్ పూరీ.
ఈ మేరకు ‘రెండు పవర్‌హౌస్‌లు.. ఒకటే బ్లాస్ట్.. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘పూరీసేతుపతి’ కోసం JBమోషన్ పిక్చర్స్ సహకరిస్తుంది.. పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్ అండ్ జె.బి.నారాయణరావు కొండ్రోల్లా నిర్మాతలు.. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ అండ్ మలయాళంలో విడుదలవుతుంది’ అని తెలుపుతూ ఓ ఫొటో రిలీజ్ చేశారు. కాగా.. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సంయుక్త, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. లింక్






