‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ నుంచి క్రేజీ అప్డేట్.. సోషల్ మీడియా తగలబడి పోతుందంటూ నిర్మాత ట్వీట్

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు నిర్మాత SKN సూపర్ న్యూస్ చెప్పారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ నుంచి క్రేజీ అప్డేట్.. సోషల్ మీడియా తగలబడి పోతుందంటూ నిర్మాత ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు నిర్మాత SKN సూపర్ న్యూస్ చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమాలో పవన్ కల్యాణ్ ఓ పాటకు చేసిన డాన్స్ చూస్తే కళ్లలో నీళ్లు వచ్చాయి. భావోద్వేగంతో గుండె నిండిపోయింది. చూడ్డానికి రెండు కళ్లు సరిపోలేదు. ఆయన పాట, లిరిక్స్ బయటకు వచ్చిన రోజు సోషల్ మీడియా మొత్త తగలబడి పోవడం ఖాయం. ఆ రోజున మళ్లీ మాట్లాడుకుందామని సోషల్ మీడియా వేదికగా SKN పోస్టు పెట్టారు. కాగా, హరీష్ శంకర్ తెర‌కెక్కిస్తున్న‌ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చిత్రీకరణ శ‌ర‌వేగంగా సాగుతోంది. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మాస్, యాక్షన్ ప్రియుల్ని ఆకట్టుకునే విధంగా సినిమా రూపుదిద్దుకుంటోందని నిర్మాతలు హామీ ఇస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Next Story