రూట్ మార్చిన విజయ్ దేవ‌ర‌కొండ..గోదావరి యాసతో వ‌స్తోన్నాడు

by velandi.Saikiran |

విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా మెరువనున్నారు. విజయ్ సేతుపతి విలన్ అంటున్నారు.

రూట్ మార్చిన విజయ్ దేవ‌ర‌కొండ..గోదావరి యాసతో వ‌స్తోన్నాడు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు రౌడీ జనార్ధన మూవీతో వస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా మెరువనున్నారు. విజయ్ సేతుపతి విలన్ అంటున్నారు.

రాజశేఖర్, సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రౌడీ జ‌నార్ధ‌న్ సినిమాలో విజయ్ దేవ‌ర‌కొండ పాత్ర‌ను రివీల్ చేశారు. రౌడీ బాయ్ విజయ్ దేవ‌ర‌కొండ ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడతాడని వెల్ల‌డించారు నిర్మాత దిల్ రాజు. ఆ యాస అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌ని తెలిపారు. ఈ సినిమా గోదావ‌రి బ్యాక్ డ్రాప్ లో రానుంద‌న్నారు. కాగా ఇవాళ రిలీజ్ అయిన రౌడీ జనార్ధన టైటిల్ టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

Next Story