యూట్యూబ్‌లో వ్యూవ్స్ కొనకండి.. ట్రైలర్, టీజర్ వ్యూవ్స్‌పై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ మ‌రియు పాట‌ల‌కు వ‌చ్చే యూట్యూబ్ వ్యూవ్స్ పై నిర్మాత దిల్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ్ముడు సినిమా ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడారు.

యూట్యూబ్‌లో వ్యూవ్స్ కొనకండి.. ట్రైలర్, టీజర్ వ్యూవ్స్‌పై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ మ‌రియు పాట‌ల‌కు వ‌చ్చే యూట్యూబ్ వ్యూవ్స్ పై నిర్మాత దిల్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ్ముడు సినిమా ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడారు. తమ్ముడు సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశామని దానికి వచ్చే వ్యూవ్స్ అన్నీ ఒరిజినల్ అని చెప్పారు. ప్రేక్షకులు చూసిన వ్యూవ్స్ మాత్రమే అక్కడ ఉండాలని పీఆర్ టీమ్ ను ఆదేశించానని అన్నారు. మిలియన్స్ కొద్దీ వ్యూవ్స్ కొనుక్కుంటే అది ప్రేక్షకులకు ఎంత రీచ్ వస్తుందో అర్థం కావడం లేదని చెప్పారు.

ఈ విషయంలో తానే మొదటి అడుగు వేశానని అన్నారు. మీడియా మిత్రులు దీనికి సహకరించాలని కోరారు. పీఆర్ టీమ్‌కు వ్యూవ్స్ కొనుగోలు చేయవద్దని కఠినంగా ఆదేశాలు జారీ చేశానని చెప్పారు. కంటెంట్ బాగుంటే రీచ్ వస్తుందని కోర్ట్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రూవ్ చేశాయని అన్నారు. కాబట్టి కంటెంట్‌నే నమ్ముకుందామని దిల్ రాజు సూచించారు. యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన తరవాత వచ్చిన వ్యూవ్స్ ఆధారంగా ఏమైనా మార్పులు చేయాలా అని కూడా ఆలోచించవచ్చని అన్నారు. ఇక దిల్ రాజు చేసిన కామెంట్లు వైరల్ అవ్వడంతో అవన్నీ పెయిడ్ వ్యూవ్స్ ఆ మేము నిజంగానే వస్తున్నాయని అనుకుంటున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు గేమ్ చేంజర్ ఎఫెక్ట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Next Story