- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మిక మందన్న సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు.. వైరల్‌గా నిర్మాతల కామెంట్స్
రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’.

దిశ, సినిమా: రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గోన్న నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి సినిమాపై అసక్తికర కామెంట్స్ చేశారు. ‘మేము ఈ ప్రాజెక్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి థియేట్రికల్ గానే వెళ్లేందుకు ప్లాన్ చేశాం. ప్రొడ్యూసర్‌గా కమర్షియల్‌గా మూవీ ఉండాలని కోరుకుంటాం. కానీ మేము రిస్క్ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ఈ స్టోరీ నచ్చింది. లవ్ స్టోరీస్‌ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది.
అలాంటప్పుడు స్టార్స్‌ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. పర్‌ఫార్మర్స్‌నే తీసుకోవాలి. దీక్షిత్ మంచి పర్‌ఫార్మర్. రశ్మిక లాగే తన క్యారెక్టర్‌లో ఆకట్టుకునేలా నటించాడు. ఈ ఏజ్ గ్రూప్‌లో నాకు తెలిసిన వాళ్లలో దీక్షిత్ ఈ మూవీకి పర్పెక్ట్ అనిపించింది. సినిమా చూశాక మీకూ అదే ఫీల్ కలుగుతుంది. అనూ ఇమ్మాన్యుయేల్ మంచి రోల్ చేసింది. తనది గెస్ట్ రోల్ కంటే పెద్ద క్యారెక్టర్. ఈ క్యారెక్టర్‌కు ఆమె పర్పెక్ట్‌గా కుదిరింది. మామూలుగా సినిమా రిలీజ్ అంటే చివరిదాగా టెన్షన్ పడుతుంటాం. కానీ "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా విషయంలో మేము నమ్మింది స్క్రీన్ మీద కనిపిస్తోంది. సో హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉన్నాం. రిలీజ్‌కు మంచి డేట్ దొరికింది. రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు అనేది డేట్స్ అనౌన్స్ చేస్తాం. ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు.






