అఖండ -2 రిలీజ్.. చిన్న సినిమాల వాయిదాపై బన్నీవాసు స్పందన ఇదీ..

by Naga Rani Yarlagadda |

అఖండ-2 తాండవం ఈనెల 12న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయిన వేళ..

అఖండ -2 రిలీజ్.. చిన్న సినిమాల వాయిదాపై బన్నీవాసు స్పందన ఇదీ..
X

దిశ, వెబ్‌డెస్క్: అఖండ-2 తాండవం ఈనెల 12న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయిన వేళ.. ఈ తేదీన విడుదలవ్వాల్సిన సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. ఈషా, మోగ్లీ, సఃకుటుంబానాం, సైక్ సిద్ధార్థ్, ఘంటసాల, నా తెలుగోడు, మిస్టీరియస్, ఇట్స్ ఓకే గురు వంటి సినిమాల విడుదల వాయిదా పడ్డాయి.ఈషా సినిమా హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కగా.. ఈ సినిమా సమర్పకుడిగా వ్యవహరించిన నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ స్పందించారు.

చిన్న సినిమాలకు సపోర్ట్ ఉండదని మరోసారి రుజువైంది. దీని గురించి మీరేం చెప్తారు అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. సినిమా చిన్నదైనా, పెద్దదైనా రెండూ వ్యాపారమేనన్నారు. కానీ పెద్దహీరో సినిమా రిలీజవుతుందంటే దానిపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందన్నారు. చిన్న సినిమాలపై ఎఫెక్ట్ ఉంటుందన్న మాట నిజమే కానీ.. నిర్మాతలు చిన్న సినిమాల సేఫ్టీ గురించి ఆలోచిస్తారన్నారు.

నిర్మాత బన్నీ వాసు సైతం దీనిపై స్పందించారు. కకారులో వెళ్తుండగా వెనుక నుంచి లారీ హారన్ కొడితే ఎలా పక్కకు తప్పుకుంటామో.. సినిమాల విషయంలోనూ అంతే అని తెలిపారు.

Next Story