- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా జీవితంలో లవ్ లేకపోవడానికి వాళ్లిద్దరే కారణం..బన్నీవాస్ షాకింగ్ కామెంట్స్
తన జీవితంలో లవ్ పార్ట్ లేకపోవడానికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ లే కారణం అని నిర్మాత బన్నీ వాసు షాకింగ్ కామెంట్లు చేశారు. మిత్ర మండలి సినిమా ఈవెంట్‌లో బన్నీవాసు పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తన జీవితంలో లవ్ పార్ట్ లేకపోవడానికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ లే కారణం అని నిర్మాత బన్నీ వాసు షాకింగ్ కామెంట్లు చేశారు. మిత్ర మండలి సినిమా ఈవెంట్‌లో బన్నీవాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లి దండ్రుల కంటే తాను అల్లు అరవింద్‌తోనే ఎక్కువ సమయం గడిపానని చెప్పారు. అల్లు అరవింద్ తనకు గాఢ్ ఫాదర్ లాంటి వారని చెప్పారు. 19ఏళ్ల వయసు ఉన్నప్పుడే అల్లు అరవింద్ దగ్గరకు వచ్చానని అన్నారు. అప్పటి నుండి తనను అల్లు అర్జున్ దగ్గర వాచ్ మెన్‌గా పెట్టేశారని వ్యాఖ్యానించారు.
తన జీవితంలో లవ్ పార్ట్ మిస్ అయ్యింది అంటే దానికి కారణం అల్లు అర్జున్, అల్లు అరవింద్ లే అని సరదాగా అన్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, బన్నీ వాస్ సంయుక్తంగా అనేక సినిమాలను నిర్మించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 100 పర్సెంట్ లవ్, భలే భలే మొగాడివోయ్ లాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. బన్నీవాస్ నిర్మాత మాత్రమే కాకుండా అల్లు అర్జున్ కు మంచి స్నేహితుడు. వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంటుంది.






