- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు అవసరమే లేదు..నిర్మాత సంచలనం !
నిర్మాత అనిల్ సుంకర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో డబ్బింగ్ సినిమాలు మనకెందుకు అంటూ ఫైర్ అయ్యారు. దాదాపు ఈ సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడం దారుణం అంటూ మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంక్రాంతికి వరుసగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అరడజనుకు పైగా సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఇందులో ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. దానికి తోడు తమిళ హీరో విజయ్, శివ కార్తికేయ నటించిన సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో డబ్బింగ్ సినిమాలు మనకెందుకు అంటూ ఫైర్ అయ్యారు.
దాదాపు ఈ సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడం దారుణం అంటూ మండిపడ్డారు. ఈ తెలుగు సినిమాలకు ఇవ్వకుండా డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వడం అనైతికం అంటూ నిప్పులు చెరిగారు. తెలుగు సినిమాలు లేకపోతే, డబ్బింగ్ సినిమాలకు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో నిర్మాత అనిల్ సుంకర చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. కాగా ఆయన నిర్మాతగా వ్యవహరించిన నారీ నారీ నడుమ మురారి ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Read More..






