- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబల్ సమ్మిట్‌లో పుష్ప ప్రస్తావన..అల్లు అరవింద్ వ్యాఖ్యలు వైరల్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకల్ ఏరియాల చుట్టూ తిరిగే కథలతో

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకల్ ఏరియాల చుట్టూ తిరిగే కథలతో తెరకెక్కించిన 'కాంతార', 'పుష్ప' సినిమాలు గ్లోబల్ స్థాయిలో నిలబడ్డాయని వెల్లడించారు. స్థానిక ప్రాంతాలతో ముడిపడి ఉన్న కథలతో తీసిన సినిమాలే ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాయని స్పష్టం చేశారు.
సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందన్న అల్లు అరవింద్..ఇలాగే సాయం అందిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఇక అటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో నటి జెనీలియా దేశ్‌ముఖ్ మాట్లాడారు. నటిగా, నిర్మాతగా తన మొదటి సినిమాలు తెలంగాణలోనే మొదలయ్యాయని తెలిపారు. తెలుగు ఇండస్ట్రీ ఎంతో సెక్యూర్ అని.. తనని ఎంతగానో ప్రోత్సహించిందని వెల్లడించారు. ఈ ఇండస్ట్రీ నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నానని గుర్తు చేసుకున్నారు జెనీలియా.






