- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదిపురుష్ విషంలో జరిగినట్లు ‘కలాం’లో జరగదు.. ఓం రౌత్‌పై నమ్మకముంది అంటున్న నిర్మాత
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా దూసుకుపోతున్న వారిలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఒకరు.

దిశ, సినిమా: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా దూసుకుపోతున్న వారిలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఒకరు. ‘గూఢచారి, కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, ఢిల్లీ ఫైల్స్’ వంటి ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ఈ నిర్మాత ప్రస్తుతం గూఢచారి-2, ది ఇండియా హౌస్, కలాం వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు.. ‘ఆదిపురుష్ మూవీ భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది.. మరి ఇప్పుడు అదే డైరెక్టర్ ఓం రౌత్‌తో ఇండియా హౌస్ చేస్తున్నారు రిస్క్ అనిపించడం లేదా’ అనే ప్రశ్న ఎదురుకాగా.. ‘ఓం రౌత్ సినిమాతో నాకు రిస్క్ అనిపించడం లేదు.. అతను చాలా మంచి ఫిల్మ్ మేకర్. ఆదిపురుష్ అలా అయినప్పటికీ ‘కలాం’ విషయంలో అలాంటిదేమీ జరగదు’ అని రిప్లై ఇచ్చారు అభిషేర్ అగర్వాల్. కాగా.. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ప్రాజెక్ట్ ‘కలాం’. భారతదేశపు మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన ఎ.పి.జె. అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 2025 మేలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ చేయబడిన ఈ ప్రాజెక్టు సంబంధించిన షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది.






