- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అరసన్’లో యంగ్ బ్యూటీ ఫిక్స్.. త్వరలోనే సెట్‌లోకి ఎంట్రీ
‘అరసన్’ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ ఫిక్స్ అయిందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

దిశ, సినిమా: జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరో శింబు కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘అరసన్’. శింబు కెరీర్‌లో ఇది 49వ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను తన వి. క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి యూత్ ఫేవరెట్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గత డిసెంబర్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. అయితే.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఆండ్రియా కీలక పాత్రల్లో నటించనున్నారు. వీరితో పాటు ప్రియాంక మోహన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుండగా ఈ సెకండ్ షెడ్యూల్‌లో ఆమెపై కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారట మేకర్స్. త్వరలోనే ఈ బ్యూటీ అరసన్ సెట్‌లోకి అడుగు పెట్టనున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వస్తుండగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. కాగా.. 1980, 1992, అండ్ 1995 నాటి మధురైకి చెందిన ఒక కబడ్డీ ఆటగాడు చెన్నైలో గ్యాంగ్‌స్టర్‌గా మారే ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.






