బర్త్‌డే స్పెషల్.. మరో కొత్త మూవీ ప్రకటించిన ప్రియాంక మోహన్

by Chukka Sudharani |

హీరోయిన్ ప్రియాంక మోహన్ తమిళం, తెలుగు అండ్ కన్నడ భాషల్లో నటిస్తున్న తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను సొంతం చేసుకుంది.

బర్త్‌డే స్పెషల్.. మరో కొత్త మూవీ ప్రకటించిన ప్రియాంక మోహన్
X

దిశ, సినిమా: హీరోయిన్ ప్రియాంక మోహన్ తమిళం, తెలుగు అండ్ కన్నడ భాషల్లో నటిస్తున్న తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను సొంతం చేసుకుంది. పవన్ కల్యాన్, నాని, ధనుష్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ బ్యూటీ.. ప్రజెంట్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హీరోయిన్ బర్త్‌డే కావడంతో మరో సినిమా అప్డేట్ వచ్చింది. డాక్టర్ శివ రాజ్ కుమార్ & ధనంజయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్‌ను ఫిక్స్ చేసినట్లు చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ‘నేను శివ రాజ్ కుమార్ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను. ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’లో భాగం కావడంతో నా కల నిజమైంది. అలాగే మోస్ట్ టాలెంటెడ్ నటుడు ధనంజయతో కలిసి పనిచేయడం, ఈ యూనిట్‌లో చేరడం చాలా సంతోషంగా ఉంది. హేమంత్ ఎం రావుతో కలిసి పనిచేయడం కోసం నేను ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను’ అని తెలిపింది. కాగా.. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు అండ్ కన్నడ భాషలలో ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Next Story