- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSMB-29: ‘ఎస్ఎస్ఎంబీ-29’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ‘మందాకి’నిగా ప్రియాంక చోప్రా..
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఎస్ఎస్ఎంబీ-29’.

దిశ, సినిమా: మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఎస్ఎస్ఎంబీ-29’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ నుంచే సినీ లవర్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ రాజమౌళి. ఇందులో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ‘ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ.. దేశీ గర్ల్ ప్రియాంక చోప్రాకు స్వాగతం.. మందాకిని యొక్క లెక్కలేనన్ని షేడ్స్ ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను..’ అంటూ ఇందులో ప్రియాంక మందాకి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపాడు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో రెండు కొండల మధ్యలో చేతిలో గన్‌తో పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది ప్రియాంక. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతోన్న ఈ మూవీలో పృథ్వీ సుకుమారన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.






