- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priyanka Chopra: వైట్ కలర్ దుస్తుల్లో ఆస్కార్ వేడుకకు అందం తెచ్చిన బ్యూటీ
ఆస్కార్ అవార్డు వేడుకలకు అద్భుతమైన అందం తెచ్చిన ప్రియాంక చోప్రా

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం 'వారణాసి'లో హీరోయిన్గా నటిస్తోంది. ఈమె నటిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి చాలా కాలమే అవుతున్నా తెలుగు సినిమాల్లో నటించలేదు. చాలా సంవత్సరాల క్రితం రామ్ చరణ్ హీరోగా రూపొందిన జంజీర్ చిత్రంలో హీరోయిన్గా నటించింది.
కానీ ఆ సినిమా హిందీలోనే రూపొందించబడింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ చాలా సినిమాల్లో తన అందాలతో, నటనతో జనాలను అలరించింది. సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ అవార్డు దక్కితే చాలు అనుకునేవారు సినీ పరిశ్రమలో అనేకమంది ఉంటారు.
ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకల్లో పాల్గొనడానికి కూడా అదృష్టం ఉండాలి, చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతూ ఉంటుంది. తాజాగా జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలకి ప్రియాంక చోప్రా హాజరయ్యింది. ఈ వేడుకకు ఈ బ్యూటీ వైట్ కలర్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ వేసుకొని వెళ్ళింది. ఇందులో ఈమె హాట్ లుక్లో ఉండడంతో ప్రస్తుతం ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఈ ఈవెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.






