SSMB29పై ఫస్ట్ టైమ్ స్పందించిన ప్రియాంక చోప్రా.. ఎంతో మిస్ అవుతున్నా అంటూ కామెంట్స్

by Chukka Sudharani |

మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

SSMB29పై ఫస్ట్ టైమ్ స్పందించిన ప్రియాంక చోప్రా.. ఎంతో మిస్ అవుతున్నా అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్ నుంచే ‘SSMB29’పై ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో.. మహేశ్ బాబు మూవీ నుంచి ఏ ఒక్క అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. ‘ఈ ఏడాది ఓ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాను. ఇండియా సినిమాలు, ఆడియన్స్‌ను ఎంతో మిస్ అవుతున్నాను. మళ్లీ ఇక్కడి ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది’ అని తెలిపింది. కాగా.. అడ్వెంచరస్ మూవీగా రాబోతున్న SSMB29 కొత్త షెడ్యూల్ జులై రెండో వారంలో కెన్యాలో స్టార్ట్ కాబోతుందని టాక్. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

Next Story