రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్‌కు ఫిదా అయిన ప్రియాంక చోప్రా

by Pulgam srinivas |

‘పెద్ది’ ట్రైలర్ ఓవరాల్‌గా ఫైర్ అంటూ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్‌కు ఫిదా అయిన ప్రియాంక చోప్రా
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మే 18వ తేదీన ముంబై వేదికగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్‌ను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. విడుదలైనప్పటి నుంచి ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘పెద్ది’ ట్రైలర్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. “ఓవరాల్‌గా ‘పెద్ది’ ట్రైలర్ ఫైర్. రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, దర్శకుడు బుచ్చిబాబు సనా అలాగే మొత్తం టీమ్‌కు అభినందనలు.

సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. చాలా సంవత్సరాల క్రితం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘జంజీర్’ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, వీరిద్దరి జంటకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ‘పెద్ది’ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4వ తేదీన విడుదల కానుండగా ఈ చిత్రంపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Next Story