- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Priyanka Chopra: అలాంటి సినిమాలు పేరుప్రఖ్యాతలు తెస్తాయి.. ప్రియాంక చోప్రా కామెంట్స్ వైరల్

దిశ, సినిమా: ఆడమ్ జె. గ్రేవ్స్ తెరకెక్కించిన ‘అనుజ’ (Anuja) చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమాజంలోని అసమానతలు, పరిస్థితులు, సమస్యలను కళ్లను కట్టినట్లు తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు (Oscar Award) బరిలో నిలిచింది. లైవ్ యాక్షన్ షార్ట్ కేటగిరిలో అకాడమీ ఎంపిక చేసిన టాప్ 10 చిత్రాల్లో ‘అనుజ’ చోటు దక్కించుకుంది. ఈ మూవీ నిర్మాణంలో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా భాగమవ్వడం విశేషం. ఇక ఈ చిత్రం ఆస్కార్‌కి నామినేట్ అయిన సందర్భంగా ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘‘అనుజ’ చిత్రానికి అమెరికా (America) ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ (International Film Festiva) దీన్ని ప్రదర్శించగా కొన్నింట్లో విజేతగాన నిలిచింది. ఇలాంటి సినిమా నిర్మాణంలో భాగమైనందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్న ఎంతో మంది చిన్నారుల్ని ప్రభావితం చేస్తుంది. మనం తీసుకున్న నిర్ణయాలు వర్తమానం, భవిష్యత్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథలో కనిపిస్తుంది. కమర్షియల్ చిత్రాలు డబ్బు తెచ్చి పెడితే.. ఇలాంటి అవార్డు విన్నింగ్ చిత్రాలు దేశానికి పేరుప్రఖ్యాతలు తెచ్చి పెడతాయి’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ప్రియాంక చోప్రా SSMB -29 సినిమాలో నటిస్తుందని వార్తలు వస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ కోసం తాజాగా హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే అమెరికాలో ప్రదర్శితమైన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోనూ రిలీజ్ కానుంది.