మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి ప్రియాంక అరుల్ మోహన్ గ్రీన్ సిగ్నల్

by Chukka Sudharani |   (  Updated:2026-03-21 12:11:10  IST  )

‘మేడ్ ఇన్ కొరియా’ మూవీ మాదిరిగానే మరో ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ప్రియాంక అరుల్ మోహన్.

మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి ప్రియాంక అరుల్ మోహన్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, సినిమా: ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) నటించిన తాజా లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మేడ్ ఇన్ కొరియా’(Made in Korea). దర్శకుడు రా కార్తీక్(Director Ra Karthik) తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అందుకుని డిజిటల్ దునియాలో రికార్డులు సృష్టిస్తుంది. ప్రజెంట్ ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక.. అప్పుడే తన తదుపరి చిత్రానికి ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ బ్యూటీ. ఈ ఓరియెంటెడ్ చిత్రానికి 'చక్ర' ఫేమ్ ఎం. ఎస్. ఆనందన్(Director M.S. Anandan) దర్శకత్వం వహించనుండగా, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ‘మేడ్ ఇన్ కొరియా’తో ఓటీటీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రియాంక.. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో థియేటర్‌లో సందడి చేయనుందని తెలుస్తుంది. అయితే.. ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Samyuktha Menon: పింక్ కలర్ డిజైనర్ చీరలో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతోంది

Next Story