త్వరలోనే ప్రియదర్శి సుయోధన టీజర్ ట్రైలర్..

by Chukka Sudharani |

డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా రానిస్తున్న నటుడు ప్రియదర్శి ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ ‘సుయోధన’తో రాబోతున్నాడు.

త్వరలోనే ప్రియదర్శి  సుయోధన టీజర్ ట్రైలర్..
X

దిశ, సినిమా: డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా రానిస్తున్న నటుడు ప్రియదర్శి ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ ‘సుయోధన’తో రాబోతున్నాడు. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీలో ద్రిషిక చందర్ హీరోయిన్ కాగా.. సాయికుమార్, ప్రేమ కీలకపాత్రల్లో నటించారు. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ.. ‘మంచి కదా కదానాలతో అత్యత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రియదర్శి, సాయికుమార్ ద్రిషిక చందర్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 27 న ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాము. త్వరలో ఈ సినిమా టీజర్ ట్రైలర్ అండ్ పాటలను రిలీజ్ చేస్తాము’ అన్నారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

Next Story