- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Priya Prakash Varrier: రెండు భారీ హిట్స్.. గ్లామర్ డోస్ పెంచేసిన యంగ్ హీరోయిన్
‘ఓరు అదార్ లవ్’ చిత్రంతో మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier).

దిశ, సినిమా: ‘ఓరు అదార్ లవ్’ చిత్రంతో మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier). తొలి సినిమాతోనే అభిమానులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందులో కన్ను కొట్టే ఒక్క సీన్‌తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. దీంతో ఈ క్రేజీ బ్యూటీ పేరు సోషల్ మీడియా(Social media)లో మారుమ్రోగిపోయింది. అలాగే చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో నితిన్ ‘చెక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ డిజాస్టర్‌గా నిలవడంతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు.
ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు వరుస ఫ్లాప్స్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటుంది. రీసెంట్‌గా ‘జాబిలమ్మ నీకు అంతకోపమా’ (Jaabilamma Neeku Antha Kopama), ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియా.. బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో అమ్మడు క్రేజ్ పెరిగిపోవడంతో సినిమా చాన్స్‌లు ప్రియా వారియర్ చుట్టుముట్టాయి. ఇందులో భాగంగానే గ్లామర్ డోస్ట్ కూడా పెంచేసి సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడుకి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.






