- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ 2 సినిమా చూడనున్న ప్రధాని నరేంద్ర మోడీ !
అఖండ 2 సినిమాను ప్రధాని నరేంద్ర మోడీ చూడబోతున్నట్లు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 ప్రభంజనం సృష్టిస్తోంది. మొన్న డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ రూ. 100 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకు వెళ్తోంది. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పటికే అఖండ సినిమా చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 వచ్చింది. ఈ సినిమా కథ పూర్తిగా హిందుత్వం చుట్టే ఉన్న నేపథ్యంలో, ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు.
దీంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. దానికి తోడు వీకెండ్స్ హాలిడేస్ రావడంతో కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. అయితే అఖండ 2 సినిమా బంపర్ హిట్ టాక్ రావడంతో తాజాగా సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే అఖండ 2 సినిమాను ప్రధాని నరేంద్ర మోడీ చూడబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా గురించి ఇప్పటికే మోడీ ఆరా తీశారని తెలిపారు. ఢిల్లీలో స్పెషల్ షో త్వరలోనే వెయ్యబోతున్నట్లు వివరించారు. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు ఈ అఖండ 2 సినిమాలు తిలకించబోతున్నట్లు బోయపాటి శ్రీను అధికారికంగా ప్రకటించారు.






