కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని సంతాపం

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.

కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని సంతాపం
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మోడీ సైతం కోట మృతి ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించారు. కోట శ్రీనివాస‌రావు మ‌ర‌ణం బాధ‌క‌రం అని అన్నారు. ఆయ‌న గొప్ప న‌టుడిగా, బ‌హుముఖ ప్రజ్ఞాశీలిగా గుర్తిండిపోతారని పేర్కొన్నారు. త‌ర త‌రాలుగా ప్రేక్ష‌కుల‌ను త‌న అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకున్నార‌ని తెలిపారు. సామాజిక సేవ‌లో కూడా ఆయ‌న ముందంజలో ఉన్నార‌ని, పేద‌లు అణ‌గారిన వ‌ర్గాల‌కు సాధికార‌త క‌ల్పించ‌డం కోసం కృషి చేశార‌న్నారు. కోట శ్రీనివాస‌రావు కుకోట శ్రీనివాసరావు మృతికి ప్రధాని సంతాపంటుంబ స‌భ్యులు, అభిమానుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

Next Story