- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫన్ థ్రిల్లింగ్ రోలర్ కోస్టర్‌గా 'ప్రేమంటే' ట్రైలర్..
ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’.

దిశ, సినిమా: ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ఆకట్టుకోగా.. పాజిటివ్ అంచనాల మధ్య ఈ మూవీ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తుండగా ప్రేక్షకులు మరింత ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. కొత్తగా పెళ్ళయిన జంట జీవితంలోని ప్రేమ, గొడవలు, సరదాలు, సంతోషాలని ట్రైలర్ ఫన్ రోలర్ కోస్టర్ రైడ్‌లా ప్రజెంట్ చేసింది. ప్రియదర్శి నేచరల్, హ్యుమరస్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా.. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సిట్యువేషన్ ఎంటర్టైనింగ్‌గా ఉంది. కానిస్టేబుల్ క్యారెక్టర్‌లో సుమ కనకాల తన సిగ్నేచర్ మార్క్‌తో అలరించారు. ట్రైలర్ చివర్లో తను చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలవగా.. ప్రజెంట్ ఇది నెట్టింట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రంతో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది.






