సినిమాల్లోకి ప్రేమదేశం హీరో రీ ఎంట్రీ

by Naga Rani Yarlagadda |

ప్రేమదేశం సినిమాతో ఒకప్పుడు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న అబ్బాస్..

సినిమాల్లోకి ప్రేమదేశం హీరో రీ ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమదేశం సినిమాతో ఒకప్పుడు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న అబ్బాస్.. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చాలాకాలం తర్వాత హ్యాపీ రాజ్ సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అబ్బాస్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా.. అందులో ఆయన కనిపించారు. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో గీతా కైలాసం, జార్జ్ మరియన్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

మరియా రాజా ఎలాంచెళియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జైవర్ధ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలాకాలం తర్వాత అబ్బాస్ సినిమాలో నటిస్తుండటంతో ఆయన్ను వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Next Story