కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ దక్కించుకున్న ప్రీతి అస్రాని.. క్రేజీ టైటిల్ ఫిక్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-19 11:02:35  IST  )

తమిళ హీరో విష్ణు విశాల్ నిర్మిస్తున్న సరికొత్త భారీ ప్రాజెక్ట్‌లో ప్రీతి అస్రాని హీరోయిన్‌గా ఎంపికైంది.

కోలీవుడ్‌లో  బంపర్ ఆఫర్ దక్కించుకున్న ప్రీతి అస్రాని.. క్రేజీ టైటిల్ ఫిక్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ప్రీతి అస్రాని కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. విజయవంతమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన ఈ భామ తమిళ చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన ‘29’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ప్రీతి అస్రాని కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ దక్కించుకుని వార్తల్లో నిలిచింది. తమిళ హీరో విష్ణు విశాల్ నిర్మిస్తున్న సరికొత్త భారీ ప్రాజెక్ట్‌లో ప్రీతి అస్రాని హీరోయిన్‌గా ఎంపికైంది. విక్కీ భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో యంగ్ హీరో రుద్ర భాగం అయ్యాడు. ‘ఓహో ఎంతన్ బేబీ’మూవీ తర్వాత రుద్ర నటిస్తున్న తదుపరి చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు ‘ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఇందులో డర్టీ దగ్గర రుద్ర వేలాడుతూ కనిపించగా.. ప్రీతి మాత్రం ఫెలో పైన రాణిలా కూర్చుని కనిపించింది. ఇక ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్ర దర్శకుడు విక్కీ భాస్కర్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్కూల్ నుండి వచ్చిన వ్యక్తి కావడం విశేషం.

మీ జీవితానికి మీరే హీరో అవ్వండి తర్వాతే పెళ్లి.. యువతులకు కంగన పవర్ ఫుల్ సలహా

Next Story