స్టన్నింగ్ బ్యాక్ పోజ్‌లతో మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్

by Pulgam srinivas |

రంగురంగుల డ్రెస్సులో హాట్ అందాలతో ఆకట్టుకుంటున్న ప్రగ్యా జైస్వాల్.

స్టన్నింగ్ బ్యాక్ పోజ్‌లతో మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటి ప్రగ్య జైస్వాల్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం మొత్తం మహారాష్ట్రలోని పూణే నగరంలోని సింబయాసిస్ యూనివర్సిటీలో పూర్తిచేసింది.




ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి అక్కడ మంచి గుర్తింపు సంపాదించిన అనంతరం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2015లో విడుదలైన మిర్చి లాంటి కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.




ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి విజయాలను అందుకుంది. సినిమాల్లో గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.




తాజాగా ఈ నటి మరోసారి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె డిఫరెంట్ లుక్‌లో అనేక రంగులతో కూడిన స్టైలిష్ డ్రెస్ ధరించి, తన నడుము, ఎద మరియు బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది.




అలాగే చేతిలో హ్యాండ్‌బ్యాగ్ పట్టుకొని, తన కురులను సవరించుకుంటూ ఆకర్షణీయమైన పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ తన కిల్లింగ్ స్మైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story