Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ ‘PR04’ మూవీ స్టార్ట్.. హీరోయిన్‌పై ఫుల్ క్లారిటీ (పోస్ట్)

by Chukka Sudharani |

కోలీవుడ్ (Kollywood) డైరెక్టర్, యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ప్రజెంట్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు.

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ ‘PR04’ మూవీ స్టార్ట్.. హీరోయిన్‌పై ఫుల్ క్లారిటీ (పోస్ట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) డైరెక్టర్, యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ప్రజెంట్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. ‘లవ్ టుడే’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. రీసెంట్‌గా వచ్చిన ‘డ్రాగన్’ మూవీతో స్టార్‌గా మారిపోయాడు. దీంతో ప్రదీప్ రంగనాథన్ గ్రాఫ్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ (Tollywood)లో కూడా పెరిగిపోవడంతో.. ప్రజెంట్ వరుస ఆఫర్లు అందుకుంటూ సినీ కెరీర్‌లో బిజీ అయిపోయాడు. ఇందులో భాగంగా.. ప్రస్తుతం ఈ హీరో నయనతార భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) దర్శకత్వంలో ‘ఎల్‌కే’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా.. అప్పుడు తన నెక్ట్స్ సినిమా కూడా స్టార్ట్ చేసేశాడు ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో.

‘PR04’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కీర్తీ స్వరణ్ (Keerthi Swaran) దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ మమితా బైజు (Mamita Baiju) హీరోయిన్‌గ నటిస్తుంది. ఈ మూవీ నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర బృందం.

Next Story