Pradeep Ranganathan: టాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రదీప్ రంగనాథన్ మూవీ.. ఏకంగా ముగ్గరు యంగ్ బ్యూటీస్‌తో రొమాన్స్ చెయ్యనున్న హీరో

by Chukka Sudharani |

కోలీవుడ్ (Kollywood) డైరెక్టర్, యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ‘లవ్ టుడే’ (Love today) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు.

Pradeep Ranganathan: టాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రదీప్ రంగనాథన్ మూవీ.. ఏకంగా ముగ్గరు యంగ్ బ్యూటీస్‌తో రొమాన్స్ చెయ్యనున్న హీరో
X

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) డైరెక్టర్, యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ‘లవ్ టుడే’ (Love today) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఇక రీసెంట్‌గా ‘డ్రాగన్’ (Dragon) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో మరో ఘన విజయాన్ని అందుకోవడంతో.. ప్రదీప్ రంగనాథన్ గ్రాఫ్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ (Tollywood)లో కూడా పెరిగిపోయింది. దీంతో ప్రజెంట్ వరుస ఆఫర్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ప్రస్తుతం ఈ హీరో నయనతార (Nayanthara) భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) దర్శకత్వంలో ‘ఎల్‌కే’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా.. అప్పుడు తన నెక్ట్స్ సినిమాపై నెట్టింట వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రదీప్ రంగనాథన్ తన నెక్ట్స్ సినిమాను టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాణంలో చేస్తున్నాడట. లేడీ డైరెక్టర్ సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు టాక్. అలాగే ఈ మూవీలో ప్రేమలు ఫేమ్ మమిత బైజూ (Mamita Baiju)తో పాటు అనూ ఇమాన్యుల్ (Anu Emmanuel), సీరియల్ నటి ఐశ్వర్య శర్మ (Aishwarya Sharma) హీరోయిన్లుగా ఫైనల్ అయ్యారట. అంతే కాకుండా.. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ఫీలిమ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

Next Story