Pradeep Ranganathan: అది నా జీవిత కలల అంటూ మనసులో మాట బయట పెట్టిన ప్రదీప్ రంగనాథన్

by Chukka Sudharani |

లవ్ టుడే, డ్రాగన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. వరుస సినిమాలు లైన్‌లో పెడుతున్నాడు.

Pradeep Ranganathan: అది నా జీవిత కలల అంటూ మనసులో మాట బయట పెట్టిన ప్రదీప్ రంగనాథన్
X

దిశ, సినిమా: లవ్ టుడే, డ్రాగన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. వరుస సినిమాలు లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK), డ్యూడ్ ఉన్నాయి. కీర్తి శ్వరన్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్యూడ్’ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు ‘LIK’ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచాడు హీరో. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నయనతారా నిర్మిస్తుంది.

ఇక ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రదీప్ రంగనాథన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రదీప్ తన జీవితంలో ఎప్పటికైనా మార్షల్ ఆర్టిస్ట్, హాంగ్ కాంగ్ నటుడు, డైరెక్టర్ జాకీచాన్‌తో ఓ సినిమా చేయాలని ఉందని చెప్పాడు. అలాగే.. ఆ సినిమాలో జాకీచాన్ ప్రధాన పాత్రలో నటిస్తారని చెప్పగా తానే సొంతంగా దర్శకత్వం వహిస్తానని తెలిపాడు. అదే నా కలల ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్ రంగనాథన్. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. లింక్

Next Story