Pradeep Ranganathan: మరో సినిమా అనౌన్స్ చేసిన ప్రదీప్ రంగనాథన్.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న పోస్టర్

by sudharani |   ( Updated:2025-05-10 09:41:45.0  )
Pradeep Ranganathan: మరో సినిమా అనౌన్స్ చేసిన ప్రదీప్ రంగనాథన్.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న పోస్టర్
X

దిశ, సినిమా: ‘డ్రాగన్’ (Dragon) చిత్రంతో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఈ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో కూడా రిలీజ్ చేసి ఇక్కడ కూడా సక్సెస్ అందుకున్నారు. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు అనౌన్స్ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే 'lik' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) సినిమాతో బిజీగా ఉన్న ఈ హీరో.. ఇటీవల మరో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. PR04 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కీర్తి శ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా.. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. PR04 ‘డ్యూడ్’ (DUDE) టైటిల్ ఫిక్స్ చేయగా.. ‘'డ్యూడ్'కి దారి ఇవ్వండి.. మీ అందరినీ గొప్పగా అలరించడానికి వస్తున్నారు.. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం & హిందీ భాషలలో 2025 దీపావళిలో భారీగా విడుదల అయ్యేందుకు అంతా సిద్ధం’ అంటూ షేర్ చేసిన ఈ పోస్టర్‌లో ప్రదీప్ రంగనాథన్.. ఫేస్‌కి, చేతికి దెబ్బలతో దర్శనమివ్వంతో పాటు తన చేతిలో తాళీ కూడా పట్టుకోవడం ఉత్కంఠగా మారింది.



Next Story

Most Viewed