- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ప్రభాస్‌తో సుకుమార్..
రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ గ్రిప్పింగ్ అండ్ కామిక్ టైమింగ్‌తో ఆడియన్స్‌కు కితకితలు పెట్టగా.. థియేటర్స్‌లో నవ్వుల సునామీ

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ గ్రిప్పింగ్ అండ్ కామిక్ టైమింగ్‌తో ఆడియన్స్‌కు కితకితలు పెట్టగా.. థియేటర్స్‌లో నవ్వుల సునామీ సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చేయనుండగా.. ఆ తర్వాత ‘ప్రశాంత్ వర్మ’తో చిత్రంపై చర్చలు జరుగుతున్నట్లు టాక్. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఖుష్ అయ్యేలా చేస్తుంది.
ప్రభాస్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మూవీ తెరపైకి రాబోతుందని.. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడనిక.. మాసివ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నారని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే సుకుమార్ - రామ్ చరణ్‌తో సినిమా పూర్తి చేయాల్సి ఉండగా.. ఇటు ప్రభాస్ కల్కి, సలార్ సీక్వెల్స్ కూడా ఉన్నాయి. మరీ ఈ కాంబో సెట్ అయ్యేందుకు ఎన్ని ఇయర్స్ పడుతుందో చూడాలి. కాగా ‘ఆర్య 2’ నుంచి ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నామని త్వరగా దింపాలని సూచిస్తున్నారు ఫ్యాన్స్.






