- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ ‘స్పిరిట్’ అప్డేట్.. అదిరిపోయిన కొత్త పోస్టర్
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తోన్న స్పిరిట్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తోన్న స్పిరిట్ మూవీ(Prabhas Spirit Movie)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి దర్శకుడు సందీప్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. కీలక పాత్రలో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ కనిపించబోతున్నట్లు రివీల్ చేశారు. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేశారు. చుట్ట తాగుతున్న స్టైలీష్ ఫొటో అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. సీనియర్ నటి కాంచన తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. టీ-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్ భాషలతో పాటు మరిన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్‌పై యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.
And that’s @vivekoberoi from #Spirit 🔥
— Spirit (@InSpiritMode) February 27, 2026
In Cinemas across the World on March 5th, 2027.#OneBadHabit@InSpiritMode#Prabhas @imvangasandeep @tripti_dimri23 #AishwaryaDesai @rameemusic @sureshsrajan #BhushanKumar @vangapranay #KrishanKumar @ShivChanana @neerajkalyan_24… pic.twitter.com/U98fxyH7Yv






