- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీక్రెట్ గా హీరోయిన్ కు హైదరాబాద్ బిర్యానీ తినిపించిన ప్రభాస్ !
హీరో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాళవిక. సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి హీరోలు ఎవరు ఉండబోరని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బిర్యానీ కూడా తనకు తినిపించారని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. కామెడీ, హారర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, రిద్ది కుమార్... ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్లు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి ముందు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా తీసుకువచ్చింది ది రాజా సాబ్. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మాళవిక పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాళవిక. సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి హీరోలు ఎవరు ఉండబోరని ఆమె వ్యాఖ్యానించారు. గొప్ప వ్యక్తుల్లో ప్రభాస్ మొదటి వరుసలో ఉంటారని తెలిపారు. మహిళల పట్ల మంచి గౌరవం ఉంటుందని వివరించారు. హైదరాబాద్ బిర్యానీ కూడా తనకు తినిపించారని హీరోయిన్ మాళవిక తెలిపారు.






