డాల్బీ స్క్రీన్‌లో ప్రభాస్, సందీప్ వంగా.. ఫ్యాన్స్‌లో మొదలైన చర్చలు

by Pulgam srinivas |

తాజాగా ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగా కలిసి 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రాన్ని వీక్షించినట్లు సమాచారం.

డాల్బీ స్క్రీన్‌లో ప్రభాస్, సందీప్ వంగా.. ఫ్యాన్స్‌లో మొదలైన చర్చలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ ప్రస్తుతం స్టార్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగా కలిసి బయట కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా వీరిద్దరూ కలిసి 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రాన్ని వీక్షించినట్లు సమాచారం. ప్రీమియం డాల్బీ స్క్రీన్ కలిగిన అల్లూ సినిమాస్‌లో ఈ సినిమాను వీక్షించినట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన వీరిద్దరి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా తమ తమ పనులతో బిజీగా ఉండే వీరిద్దరూ బయట ఎక్కువగా కనిపించరు. అలాంటి వీరు కలిసి సినిమా చూడడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించకపోవడంతో, ఆయనను ఆ పాత్రలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story