- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ సినిమా 'రాజాసాబ్' టీజర్ లీక్.. పోలీసులకు ఫిర్యాదు
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘రాజాసాబ్’ (Raja Saab) టీజర్ అధికారికంగా విడుదలై విశేష ఆదరణ పొందుతోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘రాజాసాబ్’ (Raja Saab) టీజర్ అధికారికంగా విడుదలై విశేష ఆదరణ పొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో డార్లింగ్ లుక్, డైలాగ్స్ అదిరిపోయాయని ఆయన ఫ్యాన్స్ పండగ చేసకుంటున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే, టీజర్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేయక ముందే లీక్ అయినట్లుగా మూవీ టీమ్ గుర్తించింది. ఈ క్రమంలో కుట్ర వెనుక ఉన్న వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా టీజర్‌ను ఈనెల 16న అధికారికంగా విడుదల చేశారు. కానీ, అంతకు ముందే ఆ చిత్ర టీజర్ ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో కనిపించినట్లుగా మూవీ టీమ్ గుర్తించింది. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని సాగర్ సొసైటీలోని వారాహి స్టూడియోస్‌లో టీజర్‌కు సంబంధించిన డబ్బింగ్ జరిగినట్లుగా పేర్కొన్నారు. అక్కడి నుంచి టీజర్ లీక్ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ‘రాజాసాబ్’ మూవీ డబ్బింగ్ ఇంచార్జ్ వసంత్ కుమార్ (వసంత్ కుమార్) టీజర్ లీక్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.






