Prabhas : ప్రభాస్ చేతుల మీదుగా ‘పెళ్లి కాని ప్రసాద్’ టీజర్..

by Chukka Sudharani |

ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి (Saptagiri) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెళ్లి కాని ప్రసాద్’

Prabhas : ప్రభాస్ చేతుల మీదుగా ‘పెళ్లి కాని ప్రసాద్’ టీజర్..
X

దిశ, సినిమా: ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి (Saptagiri) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెళ్లి కాని ప్రసాద్’ (Pelli Kani Prasad). ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తుండగా.. కె.వై. బాబు, భాను ప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక శర్మ (Priyanka Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన ఎస్.వి.సి సంస్థ విడుదల చేయబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఇప్పుడు ‘పెళ్లి కాని ప్రసాద్’ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టీజర్ (Teaser) రేపు రాబోతున్నట్లు తెలుపుతూ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ టీజర్‌ను లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story