- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో మరో గెస్ట్ హౌస్..ప్రభాస్ ప్లాన్ అదుర్స్!
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో తన డ్రీమ్ హౌస్ నిర్మించుకునేందుకు ప్రభాస్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణం రాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగి... దూసుకు వెళ్తున్నారు. కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ సక్సెస్ హీరోగా రఫ్ఫాడిస్తున్నారు. అయితే అలాంటి రెబల్ స్టార్ ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో తన డ్రీమ్ హౌస్ నిర్మించుకునేందుకు ప్రభాస్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో డ్రీమ్ హౌస్ కు ప్లాన్
రెండు సంవత్సరాల కిందట కొన్న ల్యాండ్ లో పనులు ప్రారంభించేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారట. ఆయనకు రాయ దుర్గంలో గెస్ట్ హౌస్ ఇప్పటికే ఉంది. ఇటీవల ఆ ఏరియా చాలా బిజీగా మారిపోయింది. ఈ తరుణంలో మరో మ్యాన్షన్ కట్టు కోవాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో హైదరాబాద్ మహా నగరం చుట్టు పక్కల వ్యవసాయ భూములను కూడా ప్రభాస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.






