- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతడిని పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్ హీరోయిన్.. ఎక్జైటింగ్‌గా ఉందంటూ వైరల్ అవుతున్న షాకింగ్ ట్వీట్
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ‘ABCD’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ‘ABCD’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఆ తర్వాత ఓకే జాను, భాఘీ, విలన్, అషికి వంటి చిత్రాల్లో నటించి తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక 2018లో శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో అమ్మడు స్టార్ హీరోయిన్‌గా మారి వరుస సినిమాల్తో అవకాశాలు అందుకుంది. 2019లో ఈ భామ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘సాహో’(Saaho) చిత్రంలో నటించింది. అయితే తెలుగులో శ్రద్ధా నటించిన మొదటి మూవీ ఇదే. కానీ హిట్ సాధించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలువడంతో మళ్లీ బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడే వరుస చిత్రాల్లో నటిస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది. ఇక గత ఏడాది ‘స్త్రీ-2’ సినిమాతో హిట్ సాధించింది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ స్త్రీ-3 చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది రోజుల నుంచి నిర్మాత రాహుల్ మోడీ(Rahul Modi)తో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు ఈవెంట్స్‌కు, ఫంక్షన్స్‌కు కూడా హాజర కావడంతో వీరు పెళ్లి చేసుకోవడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈక్రమంలో.. తాజాగా, శ్రద్ధా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు తన ట్విట్టర్ ద్వారా శ్రద్ధా పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. జూలై నెలలో మాల్దీవుల్లో ఈ వేడుక జరగనున్నట్లు టాక్. ఇక తన పెళ్లి గురించి శ్రద్ధా కపూర్ ఫుల్ ఎక్జైటింగ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ అమ్మడు తన ప్రియుడితోనే ఏడడుగులు వేయబోతుందని అంతా అనుకుంటున్నారు.






